ప్రస్తుతం ఇండియా మొత్తం కేజీఎఫ్ మానియాలో మునిగిపోయి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ మొత్తానికి అవుట్ డోర్లో ప్రత్యేకమైన షో వేశారు. సినిమా చూసిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు ఫిదా అయిపోయారు. మూవీ చూస్తున్న సేపు కళ్లప్పగించి చూశారు. మూవీ అయిపోయిన తర్వాత.. రివ్యూలు కూడా ఇచ్చారు.
తమకు నచ్చిన సన్నివేశాలను వివరిస్తూ.. ఆ అనుభూతిని పంచుకున్నారు. ఆటగాళ్లకు ప్రత్యేకమైన షో ఏర్పాట్ల నుంచి పూర్తి అయినంత వరకు మొత్తం వీడియో తీసి ఆర్సీబీ తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టు చేసింది. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఓపెనర్ అనుజ్ రావత్‌కు సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చినట్లు అర్థం అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అన్‌సోల్డ్ ప్లేయర్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్! రేపో మాపో జట్టులోకి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.