ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయం సాధించి.. తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK ఏకంగా 91 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు ధోనినే కారణం కావడం విశేషం. ఎప్పుడూ కామ్ అండ్ కూల్‌గా ఉండే ధోని.. అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లపై వేసే పంచులు ఆటమ్ బాంబుల్లా పేలుతాయి. ఆదివారం ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా కూడా ధోని బ్రావోను ఆటపట్టించాడు.
మహీష థీక్షణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఢిల్లీ ఆటగాడు అన్రిచ్ నోర్జే కవర్స్ వైపు షాట్ ఆడాడు. ఆ బంతిని బ్రావో డైవ్ చేస్తూ ఆపాడు. కానీ.. బంతిని పర్ఫెక్ట్‌గా చేతుల్లోకి అందుకోలేకపోయాడు. పైగా డైవ్ కూడా అంతే ఎఫెక్టివ్‌గా లేదు. బ్రావ్ ఫీల్డింగ్‌ను ధోని అభినందిస్తునే.. వెల్‌డన్ ఓల్డ్ మ్యాన్ అంటూ పేర్కొన్నాడు. ఈ మాట స్టంప్స్‌మైక్‌లో రికార్డ్ అయింది. దీంతో కామెంటర్లు సైతం ధోని మాటకు నవ్వుకున్నారు. ధోని కూడా చిరునవ్వుతోనే బ్రావోను ఆటపట్టించాడు. కాగా.. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచో ఒక జట్టుకు ఆడుతున్న ధోని, బ్రావో మధ్య మంచి సన్నిహిత్యం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌కు ముందు నుంచి ధోనినే కెప్టెన్‌గా ఉంటే.. CSK వేరే లెవెల్లో ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ధోని కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: DK ఇన్నింగ్స్‌తో తన డకౌట్‌ను కూడా మర్చిపోయిన కోహ్లీ! ఏం చేశాడో చూడండి
— Diving Slip (@SlipDiving) May 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.