ఐపీఎల్ 2022లో సోమవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైస్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరిత పోరులో చివరికి విజయం రాజస్థాన్‌ను వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) ఈ సీజన్‌లో రెండో సెంచరీ బాదేశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
అప్పటికే తన 3వ ఓవర్‌లో నితీష్ రాణాను చాహల్ అవుట్ చేయడం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చి.. అశ్విన్ కోలుకోలేని దెబ్బతీశాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి శ్రేయస్ భారీ షాట్లతో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 17వ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను స్టంపౌట్ చేసిన చాహల్.. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ వెంటనే శివమ్ మావీ, కమిన్స్‌లను చాహల్ బోల్తా కొట్టించాడు. దీంతో చాహల్ ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. దాంతో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తన మూడో ఓవర్ చివరి బంతికి వికెట్, తర్వాతి ఓవర్ తొలి బంతికి వికెట్ తీసుకున్న చాహల్.. 17వ ఓవర్ రెండో బంతికి ముందు హ్యాట్రిక్‌పై ఉన్నాడు. కానీ.. షెల్డన్ జాక్సన్ జాగ్రత్తగా ఆడడంతో చాహల్‌కు హ్యాట్రిక్ మిస్ అయింది.కాగా అదే ఓవర్ చివరి మూడో బంతులకు మూడు వికెట్లు తీసి.. మిస్ అయిందనుకున్న హ్యాట్రిక్‌ను సాధించాడు చాహల్. ఆ మధుర క్షణాన్ని అంతే వేరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు చాహల్. తన ట్రేడ్ మార్క్ మోచేతిపై కూర్చునే స్టైల్‌లో సంబురాలు చేసుకున్నాడు. కాగా చివర్లో కేకేఆర్ బౌలర్ ఉమేష్ యాదవ్ సిక్సులతో కాస్త కంగారు పెట్టిన.. విజయం సాధించలేకపోయాడు. దీంతో రాజస్థాన్ 7 పరుగులతో ఈ మ్యాచ్‌లో గెలుపు సాధించింది. మరి చాహల్ హ్యాట్రిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL ఫిక్సింగ్ అనే వారికి ఇదే సమాధానం!