ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి పొందింది. దీంతో ఈ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యం. వారితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలను కూడా ముంబై సంక్లిష్టం చేసింది. టోర్నీ ప్రారంభంలో ఓటములల్లో ముంబైతో పోటీ పడ్డ చెన్నై.. తర్వాత తేరుకుని రెండు విజయాలు సాధించింది. దీంతో ఎంతో కొంత ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే దారులు కనిపించాయి. కానీ.. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడి.. చెన్నై ఆశలపై నీళ్లు చల్లింది.
ఇక ముందు ఆడే ఏడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితిని కల్పించింది ముంబై ఓటమి. 36 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలవడం వల్ల ఆ జట్టు రన్‌రేట్ మెరుగుపడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఏడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ముంబై ఎనిమిదో ఓటమికి ముందు చెన్నై రాబోయే 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచినా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండేవి. ముంబైపై లక్నో గెలవడం వల్ల ఇప్పుడా ఇక్వేషన్ సాధ్యపడటం లేదు. ఏడుకు ఏడూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది.
తన తదుపరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఇవ్వాళే ఆడనుంది. పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ మ్యాచ్ సహా ప్రతి ఒక్కటీ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులో నిల్చోగలుగుతుంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రవీంద్ర జడేజా సారథ్యంలోని ఎల్లో ఆర్మీ.. చివరికి ఇలా మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది. కానీ మిగతా జట్ల ఫామ్ చూస్తుంటే చెన్నైకు వరుసగా 7 విజయాలు దక్కడం అంత ఈజీకాదు. దీంతో ముంబైతోపాటు ఇంటికి వెళ్లే జట్టు CSK కావచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరుసగా రెండు గోల్డెన్ డక్ అవుట్లు! కోహ్లీకి అండగా పాక్ ఫ్యాన్స్
Gujarat Titans now on top ⬆️
Ipl 2022 point table after 37th match
.
.
.#msdcricketspecial#IPL2022 #TATAIPL #pointtable #ipl #cricket #cricketchellenge #iplpointstable #LSGvMI pic.twitter.com/e8v4k0UdhJ— MSD CRICKET SPECIAL (@msdcricket16) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.