ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాకముందు.. ఈ సీజన్ టైటిల్ టైటిల్ కొట్టే ఛాన్స్ ఉన్న జట్లు ఏవి అంటే.. ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్.. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్. అంతకు కాదంటే కోలకతా నైట్ రైడర్స్. కానీ.. అంతా రివర్స్ లో జరుగుతోంది. టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన ఒక్కో జట్టు మెల్లిమెల్లిగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. ఇప్పుడు ఈ లిస్టులోకి కేకేఆర్ కూడా వచ్చి చేరింది.
ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది కేకేఆర్ జట్టు. అయితే.. ఈ మ్యాచులో గెలిచే అవకాశాలు కేకేఆర్ జట్టుకు ఎక్కువుగా ఉన్నప్పటికీ ఒక్క ఓవర్ మాత్రం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో శివమ్ మావి వేసిన 19వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు లక్నో 18 ఓవర్లలో142 పరుగులు సాధారణ స్కోరుతోనే ఉంది. శివమ్ మావి వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్ తొలి మూడు బంతుల్లో మూడు సిక్సులు(6, 6, 6) బాది నాలుగో బంతికి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన హోల్డర్ తర్వాతి 2 బంతులను రెండు సిక్సులు(6, 6) కొట్టడంతో మొత్తం 5 సిక్సర్లతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మొత్తానికి శివమ్ మావి కేకేఆర్ పాలిట విలన్‌గా తయారయ్యాడు.
Shivam Mavi#IPL2022 #LSGvKKR pic.twitter.com/o7iaJOyHb3
— RVCJ Media (@RVCJ_FB) May 7, 2022
ఇది కూడా చదవండి: IPL 2022 RR vs PBKS: రాజస్థాన్ ‘రాయల్’ విజయం.. పంజాబ్ ప్లే ఆఫ్స్ కు కష్టమే!
మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో అభిమానులను హోరెత్తించగా.. దీపక్ హుడా (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టొయినిస్ (14 బంతుల్లో 28; ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 101 పరుగులకు ఆలౌటైంది. డేంజర్ మ్యాన్ రస్సెల్ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో సీజన్‌లో 8వ విజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది.
If we lose this, it’s because of Shivam Mavi.
— Mason Mount is a bad footballer (@___allbrown____) May 7, 2022
Most runs off an over vs #KKR in IPL
30 – LSG (Pune) 2022
29 – DC (Delhi) 2018
28 -RR (Kolkata)2018Shivam Mavi is the bowler who gave such amazing numbers ( performance) on all three occasions pic.twitter.com/cu0l4d8nM6
— 💸manifesting💸 (@mayw777) May 7, 2022