ఈ ఏడాది ఐపీఎల్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్. సునామీ ఇన్నింగ్స్‌లు, సిక్సుల వర్షంతో ఆడియెన్స్ మనసులను దోచుకున్నాడు.
ఐపీఎల్ పదహారో సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిష్క్రమించింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఓటమితో టోర్నీలో ఆ జట్టు కథ ముగిసింది. అయితే లక్నోపై కేకేఆర్ ఆడిన తీరును మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో తొలుత లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ (58) మరోమారి తన సత్తా చాటాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓవర్లన్నీ ఆడి 175 రన్స్ చేసింది. జేసన్ రాయ్ (45), వెంకటేష్ అయ్యర్ (24) కేకేఆర్‌కు మంచి ఓపెనింగ్ అందించారు. ఇక, రింకూ సింగ్ (67) చివరి వరకు జట్టు విజయం కోసం పోరాడాడు.
రింకూ సింగ్ ఎంత పోరాడినా టీమ్‌ను గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది కేకేఆర్. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఫ్యాన్స్ హృదయాల్ని దోచుకుంది కేకేఆర్. ముఖ్యంగా రింకూ సింగ్ ఫైటింగ్ స్పిరిట్ అందర్నీ ఆకట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాటింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. కోహ్లీని గెలికిన లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు రింకూ. ఆ షాట్ ఏకంగా 110 మీటర్ల దూరం వెళ్లి పడింది. దీంతో జడుసుకున్నాడు నవీన్. కాగా, ఈ మ్యాచ్‌లో నవీన్ ఫీల్డింగ్ చేసే సమయంలో, బౌలింగ్ చేసే టైమ్‌లోనూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అతడ్ని టీజ్ చేశారు. కోహ్లీ.. కోహ్లీ.. అని అరుస్తూ నవీన్‌ను రెచ్చగొట్టారు.
Rinku Singh’s 110 meter six aganist Naveen.
What a hit. pic.twitter.com/1MgiE4pJXX
— Johns. (@CricCrazyJohns) May 20, 2023