టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను సాధించిన జట్టుగా కొత్త చరిత్రను సృష్టించింది. మీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఐదు ఫోర్లు కొట్టాడు. బట్లర్ భారీ స్కోర్ చేయలేకపోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని ప్రభావితం చేసింది. టైటిల్‌ను దూరం చేసింది. బట్లర్ అవుట్ అయిన తరువాత మిగిలిన బ్యాటర్లెవరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు.
ఈ సీజన్‌లో కప్‌ను సాధించి.. దివంగత షేన్ వార్న్‌కు ఘనంగా నివాళి అర్పించాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలు నెరవేరలేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు షేన్ వార్న్. అప్పటి జట్టుకు అతనే కెప్టెన్. తొలి కెప్టెన్‌గా.. తొలి సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కొద్దిరోజుల కిందటే షేన్ వార్న్ కన్నుమూసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభానికి ముందు షేన్ వార్న్‌కు నివాళి అర్పించింది రాజస్థాన్ జట్టు. ఈ సందర్భంగా ఓపెనర్ జోస్ బట్లర్ భావోద్వేగానికి గురయ్యాడు. షేన్ వార్న్‌ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నాడు. తమ ప్రస్థానాన్ని షేన్ వార్న్.. పైనుంచి చూస్తుంటాడని చెప్పాడు. అతని దీవెనలు జట్టుపై ఎప్పుడూ ఉంటాయని, ఫైనల్స్‌లో ఘన విజయం సాధిస్తామని బట్లర్ అన్నాడు. కానీ.. దురదృష్టవశాత్తు ఫైనల్‌లో రాజస్థాన్ విజయం సాధించలేకపోయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్థిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్థిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. మరి బట్లర్ వార్న్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ఫైనల్‌లో అరుదైన ఘనత సాధించిన గుజరాత్ బౌలర్
Jos Buttler was in tears talking about Shane Warne!!!😭💔 This broke my heart!💔#HallaBol #IPL2022 pic.twitter.com/pHoB8HdYYu
— 𝐀𝐚𝐥𝐢𝐲𝐚𝐡 (@Aaliya_Zain5) May 29, 2022
Jos Buttler crying when he talking about the memory of Legendary Shane Warne. pic.twitter.com/d4qLda2BgI
— CricketMAN2 (@ImTanujSingh) May 29, 2022