ఐపీఎల్ 2022లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. పంజాబ్ 6 మ్యాచ్‌లలో 3 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌లలో 2 విజయాలు, 3 ఓటములతో పంజాబ్ తర్వాత 8వ స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే వారి బలాబలాలను పరిశీలిద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్..ఈ జట్టుకు మంచి ఓపెనింగ్ జోడి ఉంది. కానీ నిలకడలేమి ప్రధాన సమస్య. డీసీ.. ఆర్సీబీతో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మంచి ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అదే ఫామ్ వార్నర్ కొనసాగిస్తే.. మరో మంచి ఇన్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అంత బలంగా ఏం లేదు. వార్నర్, పృథ్వీషా, పంత్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నారు. లలిత్ యాదవ్, పవెల్, శార్థుల్ ఠాకూర్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించలేం. కొద్ది సేపు మెరుపు మాత్రమే మెరిపించగలరు. మార్ష్ కరోనా కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. ఇక బౌలింగ్‌లో ఢిల్లీ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో ముస్తఫీజుర్ రహెమాన్ ధారళంగా పరుగులు ఇచ్చినా.. అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఖలీల్ అహ్మాద్, శార్థుల్ ఠాకూర్ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్‌పటేల్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.
పంజాబ్ కింగ్స్..ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమతుల్యంగా ఉంది. గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, లివింగ్‌స్టోన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ కూడా రాణిస్తే.. పంజాబ్‌కు గెలుపు కష్టమేమి కాదు. బౌలింగ్‌లో కూడా పంజాబ్ ఢిల్లీకి గట్టి పోటీని ఇవ్వగలదు. అర్షదీప్ సింగ్, రబడా, ఒడియన్ స్మిత్‌తో పేస్ ఎటాక్ దుర్భేద్యంగా ఉంది. అలాగే స్పిన్‌లో రాహుల్ చాహర్ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో పర్వాలేకున్నా.. బ్యాటింగ్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం రాకపోవడమే పంజాబ్‌కు ప్రధాన లోపం. ఆ సమస్యను అధిగమిస్తే.. పంజాబ్‌కు తిరుగుండదు.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉంది. పంజాబ్‌తో పోల్చుకుంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కొంత బలహీనంగా ఉంది. పంజాబ్ బౌలర్లు రాణించి.. ఢిల్లీని కట్టడి చేయగలితే.. పంజాబ్ బ్యాటర్లు స్థాయి మేర రాణిస్తే పంజాబ్ విజయం ఖాయం.
తుది జట్ల అంచనా..
పంజాబ్.. మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లిమ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రబడా, రాహుల్ చాహర్, ఆరోరా, అర్షదీప్ సింగ్.
ఢిల్లీ.. రిషభ్ పంత్(కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, లలిత్ యాదవ్, పావెల్, శార్థుల్ ఠాకుర్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జియా, కుల్దీప్ యాదవ్, ముస్తఫీజుర్ రహెమాన్.
ఇదీ చదవండి: వీడియో: ఆరోన్ ఫించ్, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మాటల యుద్ధం
Shahrukh c̶a̶n̶ 𝐊𝐡𝐚𝐧 hit ‘em all 💥#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #DCvPBKS @shahrukh_35 pic.twitter.com/THzT5Dz3ih
— Punjab Kings (@PunjabKingsIPL) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.