ఐపీఎల్ 2022లో ఛాంపియన్స్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలం అయ్యాయి. రెండు జట్లు వరుస ఓటములతో అందరి కంటే ముందే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకొని ఇంటిదారిపట్టాయి. అయితే ఈ పేలవ ప్రదర్శనతో ఈ రెండు జట్లు తమ పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాయి. ఈ సీజన్‌లో CSK, ముంబై పదేసి పరాజయాలను చవిచూశాయి. ఇలా ఒక సీజన్‌లో ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్‌లో కూడా చెన్నై, ముంబై ఇంత దారుణమైన ప్రదర్శన కనబర్చలేదు. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై వరుసగా 8 పరాజయాలతో ఇప్పటికే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 10 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు(శనివారం) జరిగే మ్యాచ్‌లో గెలిచి లీగ్‌ను ఘనంగా ముగించాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 10 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది.శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల వద్దే 9 ట్రోఫీలు ఉన్నాయి. ముంబై ఐదుసార్లు, చెన్నై నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచాయి. కానీ.. ఈ సీజన్‌లో మాత్రం అత్యంత దారుణంగా అట్టడుగుస్థానంలో నిలిచాయి. చెన్నైకి కెప్టెన్సీ మార్పుతో ఈ పరిస్థితి వచ్చిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ వేలంలో సరైన టీమ్‌ను తీసుకోలేదని అందుకే ఇలా ఉందని ఆ జట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sunil Gavaskar: ఇదేం చెత్త వాగుడు.. గవాస్కర్‌ను తన్ని తరిమేయండి అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్!
Updated Points Table after Match No. 67 of IPL 2022 🏏
SRH and PBKS are eliminated from IPL 2022 😕 pic.twitter.com/G857u49YIW— Fantasy Cricket News (@fantasycricbuz) May 20, 2022