ఐపీఎల్ లో చెన్నై కప్ గెలిచింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడట. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఐదో ట్రోఫీ సొంతం చేసుకుని.. అందరికంటే టాప్ లోకి వెళ్లిపోయాడు. తాజాగా జరిగిన ఫైనల్లో చెన్నై విజయం సాధించిన క్షణాలు ఇంకా అభిమానుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ధోనీ ధోనీ ధోనీ అనే సౌండ్.. ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ బయటకొచ్చింది. మొన్నటివరకు గ్రౌండ్ లో కనిపించిన ధోనీ.. సడన్ గా ఆస్పత్రికి వెళ్లనున్నాడనే వార్త ఇప్పుడు ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఇంతకీ ధోనీ ఏమైంది? ఆస్పత్రికి ఎందుకెళ్లనున్నాడు?
అసలు విషయానికొచ్చేస్తే.. ఈ ఐపీఎల్ సీజన్, అందులో చెన్నై మ్యాచ్ లు సరిగా గమనిస్తే మీకో విషయం ఈ పాటికే తెలిసే ఉంటుంది. అదే ధోనీ మోకాలి గాయం. సీజన్ ప్రారంభం కావడానికి ముందే ధోనీ గాయపడ్డాడు. అయితే ఇదేమంత పెద్దది కాదని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. అలా ధోనీ మోకాలు నొప్పిగా ఉన్నాసరే మ్యాచులన్నీ ఆడేశాడు. ఫైనల్లో జట్టుని కూడా గెలిపించేశాడు. మరోవైపు ధోనీకి ఇదే చివరి సీజన్ అని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడడని అంటున్నారు. అందుకు తగ్గట్లే ధోనీ కామెంట్స్ కూడా చేశాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో 8-9 నెలల టైమ్ ఉందని అన్నాడు.
ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. తన మోకాలికి అయిన గాయంపై పరీక్షలు చేసుకునేందుకు ఈ వారంలోనే ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో టెస్ట్ లు చేయించుకుంటాడని సమాచారం. పలు మీడియా కథనాల ప్రకారం శుక్రవారం ఇది ఉండొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చెన్నై టీమ్ కి కెప్టెన్ గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021, 2023లో కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐదు ట్రోఫీలు గెలుచుకున్న టీమ్ గా ముంబయి ఇండియన్స్ సరసన నిలిచాడు. సరే ఇది పక్కనబెడితే ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడనే వార్తలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
“The amount of love I’ve received from fans, it would be a gift for them to I play one more IPL season. It’s something I need to do for them”
– MS DHONI 🥺💛@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/b3fdbl0Q3b
— DHONIsm™ ❤️ (@DHONIism) May 31, 2023