Side Effects Of Over Sleeping: ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతీ జీవికి నిద్ర అనేది చాలా ముఖ్యం.. ఓ నిత్యవసరం. మనుషుల విషయానికి వస్తే.. మానవ శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే వాటికి విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి నిద్ర ద్వారా దొరుకుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. సరైన నిద్ర ద్వారా మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. సాధారణంగా వయసును బట్టి ఎంత సేపు నిద్రపోవాలన్న దానిలో తేడాలుంటాయి. ఓ సగటు యవ్వనస్తుడికి 7-9 గంటల నిద్ర అవసరం. చాలా మంది తక్కువ సేపు నిద్రపోతేనే నష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఎక్కువ సేపు నిద్రపోయినా నష్టాలు తప్పవు. ఎక్కువ సేపు నిద్రపోతున్నట్లయితే ప్రమాదమని పరిశోధనల్లో కూడా తేలింది. అతి నిద్ర కారణంగా ఈ క్రింది అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటీస్: అతిగా నిద్రపోవటం ద్వారా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతి నిద్ర కారణంగా మన శరీరంలో షుగర్‌ను శక్తిగా మార్చే పక్రియ దెబ్బతింటుంది. దీంతో డయాబెటీస్‌కు దారి తీస్తుంది.
గుండె జబ్బులు: ‘‘నర్సెస్ హెల్త్ స్టడీ’’ ప్రకారం అతి నిద్ర గుండె జబ్బులకు దారి తీస్తుంది. 8 గంటలు నిద్ర పోయిన వారికంటే 9-11 గంటలు నిద్రపోయిన వారు 38 శాతం ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారని తేలింది.
బ్రేయిన్ స్ట్రోక్ : సాధారణంగా మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోయినపుడు లేదా రక్తం సరఫరాకు ఆటంకం కలిగినపుడు బ్రేయిన్ స్ట్రోక్‌లు వస్తుంటాయి. ఓ పరిశోధన ప్రకారం రాత్రిళ్లు 8 గంటలు నిద్రపోతున్న వారికంటే.. 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్న వారు 23 శాతం అధికంగా బ్రేయిన్ స్ట్రోక్ బారిన పడినట్లు తేలింది.ఉబకాయం : 7-8 గంటలు నిద్రపోతున్న వారికంటే 9-10 గంటలు నిద్రపోతున్నవారు 21 శాతం ఎక్కువగా ఉబకాయం బారిన పడుతున్నట్లు ఓ పరిశోధన తేలింది. వీటితో పాటు ఒత్తిడి, తలనొప్పి వంటివి కూడా వస్తాయి.
అతి నిద్ర వల్ల కలిగే నష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రిటైర్‌మెంట్ డబ్బులతో వినాయకుడి గుడి కట్టించిన ముస్లిం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.