ధనానికి లక్ష్మీ దేవి అధిపతి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది సాధ్యం అవుతుంది. కనుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీ దేవి పటాలను, బొమ్మలను, పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తారు. ఐశ్వర్యకాళీ అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి,శత్రు దృష్టి ,వాస్తు లోపాలు,గ్రహదోషాలు ,కుటుంబ, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు. వరలక్ష్మీ వ్రతానికి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తిథి, నక్షత్రాలతో సంబంధం లేకుండా వరలక్ష్మీ వ్రతం ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మికి పూజలు చేస్తారు ముత్తయిదువులు. శక్తి మేరకు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
లక్ష్మీ కటాక్షానికి స్త్రీ పాత్రే కీలకమని చెబుతున్నాయి పురాణాలు. అత్తమామలను ఆదరించే కోడలున్న ఇంట లక్ష్మి ఉంటుంది. భర్తను గౌరవిస్తూ, అతనికి మంచి విషయాలు సూచించే భార్య నిజమైన గృహలక్ష్మి. భార్యాభర్తలు కీచులాడుకోని ఇంట్లో, అతిథులకు సరైన గౌరవం లభించే గృహంలో వరలక్ష్మి స్థిరంగా ఉంటుందని భాగవతం పేర్కొంది.
మహాలక్ష్మీ జననం గురించి మరిన్ని వివరాలకోసం ఈ వీడియోని వీక్షించండి: