తెలుగు సంవత్సరాది ఉగాదికి స్వాగతం పలుకుతూ.. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
షడ్రుచుల పచ్చడిలా జీవితం కూడా అన్ని రుచులతో కలగలిసి ఉండాలని కోరుకుంటూ.. అంతా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మార్చి 21 మంగళవారంతో శుభకృత్ నామ సంవత్సరం ముగిసి.. మార్చి 22 బుధవారంతో శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది రోజు ఇంటిల్లిపాది తలస్నానం చేసి.. కొత్త బట్టలు కట్టుకుని, ఉగాది పచ్చడిని రుచి చూసి.. పంచాగ శ్రవణం చేస్తారు. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అయితే.. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం వాళ్లు చాలా అమయాకులు, వీళ్లు చెప్పుడు మాటలు బాగా వింటారు. అయితే.. ఈ ఏడాది వీరు చేయాల్సిన ముఖ్యమైన పని.. చెప్పుడు మాటలు వినకుండా చెవులు మూసుకోవడమే. ఎందుకంటే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి రానుంది. ఈ ఏడాదిలో మంచి ఫలితాలు, శుభాలు కలిగే రాశుల్లో టాప్ 2లో కర్కాటక రాశి ఉంది. అందుకే.. ఈ రాశి వారు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా.. మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతారు. ఈ ఏడాది కర్కాటక రాశి వారి జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉండటం అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చి, ఈ ఏడాదిని మిస్ చేసుకుంటే, మళ్లీ మంచి ఏడాది కోసం 12 ఏళ్లు వేచి ఉండక తప్పదు. ఇక ఈ రాశి వారిని చంద్రరాశి వారు అంటారు. వీళ్లు రాత్రిపూట ఎక్కువగా పడుకోరు. కానీ, ఈ ఏడాది ఏ విషయంలో అయినా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం కచ్చితంగా రాత్రి పూట ప్రశాంతంగా పడుకోని, ఏం చేయాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా.. పగటి పూట కష్టపడితేనే ఫలితం ఉంటుంది. రాత్రి వీలైనంత త్వరగా పడుకుని, తెల్లవారుజామునే లేచి 4.30 గంటల నుంచి 5 గంటల మధ్య ధ్యానం చేయాలి. అలాగే ‘ఓం ఐమ్ రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ గ్రీమ్ శ్రీమ్ శ్రీ మాహాలక్ష్మే నమః’ అనే మంత్రం పఠిస్తే.. మీ సక్సెస్‌ను ఎవరూ అడ్డుకోలేరు. ఈ మంత్రం వల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. గ్రహాలు ఎలా ఉన్నా.. అమ్మవారు కాపాడుతుంది.
ప్రయాణాలు ఎక్కువగా చేయాలి. కొత్త వ్యక్తులు కలవండి. తక్కువ జీతం ఉండి, ఉద్యోగంలో ఇబ్బంది పడుతుంటే.. ఆ ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుంటే సక్సెస్ అవుతారు. బట్టలు, భూమి సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకావం మెండుగా ఉంది. లీగల్ విషయాల్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. శని యక్ష్కమంలో ఉన్న కారణంగా.. కోపం, ఈర్ష్య, ద్వేషం, పగా వంటి వాటిని పక్కనపెట్టాలి. చివరిగా.. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టమ శని ఉంటే తండ్రికి అనారోగ్యం కలుగుతుంది.