ప్రతి ఒక్కరికీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. మన తెలుగు పంచాంగం ఎవరి జాతకం ఎలా ఉంటుందో అనేది వివరిస్తుంది. మనకు కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఈ క్రమంలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. తాజాగా సీఎం కేసీఆర్ జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
శోభకృత్ నామ ఉగాది సంవత్సరం వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరాన అందరూ తమ తమ రాశిఫలాలు, జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు. సామాన్యులే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రుల జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి వారికే కాదు, ప్రజలకు కూడా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిని బట్టే రాష్ట్ర భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి జాతకం బాగుంటేనే పాలన సుభిక్షంగా సాగుతుంది. ప్రతి ఏటా కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుందో అని పండితులు చెబుతుంటారు. తాజాగా ఈ ఏడాది కూడా కేసీఆర్ జాతకం ఎలా ఉంటుందో వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ది కర్కాటక రాశి. ఫిబ్రవరి 17 1954లో ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. మేషలగ్నంలో ధన స్థానంలో గురుడు, తృతీయ స్థానంలో కేతువు, చతుర్ధ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో రాహువు, ఏకాదశంలో సూర్య, శుక్ర, బుధులతో ఉండే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టడం జరిగిందని అన్నారు. రాహువులో రవి దశ అనేది ముగిసిపోయి.. చంద్ర దశ నడుస్తుందని, కేసీఆర్ ది కర్కాటక రాశి గనుక ఈ ఏడాది శుభాశుభాల మిశ్రమ సంవత్సరంగా ఉంటుందని అన్నారు. శుభాలు, అశుభాలు కలగలిపి ఉంటాయి. ద్వితీయార్ధం అక్టోబర్ కంటే ప్రథమార్థం కొంత కలిసి వస్తుంది. ఐతే కర్కాటక రాశి వారికి ఈ జనవరి 17వ తేదీ నాడు అష్టమ శని దోషం ఏర్పడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
అన్ని విషయాల్లో ఎక్కువగా నమ్మకుండా పరిశీలన చేసుకుంటూ అన్నిటి మీద అవగాహనతో ముందుకు వెళ్లాల్సిందిగా పంచాంగం చెబుతోందని సూచించారు. కేసీఆర్ కి ద్వితీయార్ధం అంటే ఏప్రిల్ 22 నుంచి బానే ఉంటుందని అన్నారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, ఈ విషయంలో కేసీఆర్ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పండితులు సూచించారు. మొత్తానికి ఈ ఏడాది దైవ బలాన్ని అత్యధికంగా సంపాదించుకుంటే తిరుగులేని విధంగా కేసీఆర్ సమర్థత అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాటే సంవత్సరంగా ఉంటుందని అన్నారు. ఇక కర్కాటక రాశిలో పుట్టిన వారి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4 అని అన్నారు.