దీపావళి తర్వాతి రోజైన నేడు పాక్షిక సూర్య గ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. అయితే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఎలాంటి చెడు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇకపోతే మంగళవారం పాక్షిక సూర్య గ్రహణం మన భారతదేశంలో సాయంత్రం 4:15 నిమిషాల నుంచి 6:15 నిమిషాల వరకు కొనసాగింది. అయితే ఈ పాక్షిక సూర్య గ్రహణం సమయంలో చాలా మంది ఎన్నో రకాలుగా జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా, సూర్యుని చూడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక దీనికి తోడు పట్టు విడుపు స్నానాలు ఎలానో ఉండనే ఉన్నాయి. కానీ.., మీకు తెలుసా? గ్రహణం సమయంలో ఓ చిన్న పారాయణం చేయడం ద్వారా ఎలాంటి దోష ప్రభావానికి గురి కాకుండా ఉండవచ్చు అట.
నిజానికి హిందూ ధర్మంలో సూర్యుడిని భగవంతుడిగా కొలుస్తూ ఉంటాము. ఈయనకే భాస్కరుడు, ఆదిత్యుడు అని చాలా పేర్లు ఉన్నాయి. అయితే.., ఎంతో గొప్పది అయిన “ఆదిత్య హృదయం” పారాయణం చేయడం వల్ల మానవులపై ఎలాంటి దోష ప్రభావం ఉండదని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే రామాయణంలో జరిగిన యుద్ధంలో భాగంగా రావణాసురుడు ధైర్యంగా శ్రీరాముణ్ని ఎదుర్కొంటున్నాడు. రావణుణ్ని ఎలా సంహరించడమా అని శ్రీరాముడు తీవ్రంగా యోచిస్తున్నాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైనవారంతా ఏం జరగబోతుందో అని ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే శ్రీరాముడు రావణాసురుడిని ఎదుర్కునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే పరమ శివుడి అనుగ్రహం పొందిన ఆగస్త్య మహార్షి శ్రీరాముడికి ఆదిత్య హృదయ మంత్రం పారాయణ చేయడం ద్వారా విజయం వరిస్తుందని ఆగస్త్యుడు శ్రీరాముడికి చెబుతాడు. భాస్కరుడిలో సకల దేవతలు మూర్తీభవించి ఉన్నారని.. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృ దేవతలు, అష్ట వసువులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు- అందరూ భాస్కరుడి ప్రతిరూపాలే. ఇలా గాలి, అగ్ని, ఊపిరి, రుతువులు- వీటన్నింటికీ ఆధారం సూర్యుడు. ఇలా సమస్త ప్రాణులందరూ అంతర్యామి రూపంలో ఉంటూ వారు నిద్రపోయినా తాను మేల్కొంటాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు తోడునీడగా మనలో వెలుగుతున్న ఆదిత్య రూపం సర్వదా ఆరాధ్యం.
ఇలా పవిత్రమైన, శక్తవంతమైన ఆదిత్య స్తోత్రాన్ని మూడుసార్లు పఠిస్తే యుద్ధంలో విజయం లభిస్తుందని అగస్త్యుడు శ్రీరాముడికి బోధిస్తాడు. శాంతిని, కాంతిని, స్థిరత్వాన్ని, స్థాయిని ప్రసాదించే సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉందని, ఇది చదివితే విజయం తప్పక వరిస్తుందని చెబుతాడు. ఇక ఆగస్త్యుడు చెప్పిన దంతా విన్న శ్రీరాముడు శ్రీరాముడు ఆగస్త్యుడు చెప్పిన ప్రకారం ఆదిత్య హృదయ మంత్రం పారాయణ మూడుసార్లు పఠిస్తాడు. ఆ తరువాత శ్రీరాముడు ఆనందంతో, నిష్ఠతో ఆదిత్య హృదయం జపించి రావణతో యుద్దం చేసి చివరికి విజయం సాధించాడని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఇలా శ్రీరాముడి అంతటి వాడే ఇంతటి “ఆదిత్య హృదయం” పారాయణం పఠించడం అనేక శుభాలు జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మంగళవారం భారతదేశంలో సంభవించిన ఈ పాక్షిక సూర్య గ్రహణం సమయంలో ఇలాంటి ఎంతో శక్తి సామార్ధ్యాలు కలిగి ఉన్న “ఆదిత్య హృదయం” పారాయణం పఠించడం వల్ల గ్రహణం తర్వాత ఎలాంటి చెడు జరగకుండా ఉండడంతో పాటు జన్మజన్మల పాపాలు తొలగపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.