ఆంధ్ర్రప్రదేశ్‌లోని కడప నగర సమీపంలోని బుడ్డాయపల్లిలో అనీల్‌కుమార్ గీత అనే యువతీ యువకులు ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమించుకుంటున్నారు. కడపలోని నాగరాజుపేటలో ఆంథోనీ గీత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుండగా అదే ప్రాంతంలోని మరో ఆస్పత్రిలో అనీల్‌కుమార్ ల్యాబ్‌టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అనిల్‌కుమార్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడ్డాయపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఆ ఇంట్లోకి ఇద్దరూ సహజీవనం చేసుకుంటు కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక అనీల్‌కుమార్‌కు గీతపై కొంత అనుమానం చిగురించింది. దీంతో అనీల్‌కుమార్ రోజు ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తరుచు గొడవుల జరుగుతూనే ఉండేవి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గీత ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దపడింది. ఒక రోజు కోసం ప్రియురాలు గీత వేచి చూసింది. ఆ రోజు రానే వచ్చింది. ఎలాగైన చనిపోవాలని భావించి ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.