అతడు పైప్‌లైన్ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. అనవసరంగా ఎవ్వరి జోలికీ వెళ్లే వాడు కాదు. అలాంటి అతడ్ని ఇలా చేయని తప్పుకు బలి తీసుకోవటం అత్యంత పాశవికంగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.
సాధారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నపుడు సమాజం మీద ప్రేమ ఉన్న వారు వారిని విడిపించటానికి ప్రయత్నిస్తారు. ఇద్దరికీ సర్థి చెబుతారు. అయితే, ఇదే కొన్ని సార్లు మంచి చేయటానికి వెళ్లే వారి పాలిట శాపంగా మారుతోంది. మంచికి వెళితే చెడు ఎదురైందన్న మాట నిజం అవుతోంది. తాజాగా, ఓ వ్యక్తి రెండు కుటుంబాల మధ్య గొడవను ఆపటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటకలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్రదుర్గ తాలూకా, జోడీ బిక్కనహళ్లి, గూల్లరహట్టియకు చెందిన ఓ యువతీ,యువకుడు ప్రేమించుకుంటున్నారు.
వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఊరు విడిచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. గురువారం ఇంటినుంచి ఇద్దరూ పారిపోయారు. ఈ విషయం గుర్తించిన రెండు కుటుంబాల వాళ్లు గొడవలు పడటం మొదలుపెట్టారు. ఇది గమనించిన అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల బొమ్మలింగప్ప మనసు కొంచెం ఇబ్బందికి గురైంది. వాళ్లు అలా గొడవపడటం చూడలేకపోయాడు. గొడవ మధ్యలోకి దూరి వారికి సర్థిచెప్పాడు. అయితే, యువతి తరపు వారు లింగప్పపై సీరియస్ అయ్యారు. లింగప్ప ఆ ప్రేమికులకు సహకరించి ఉంటాడని భావించారు. అతడి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో లింగప్ప తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లింగప్ప మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్ పనులు చేసుకుని జీవనం సాగించే అతడు ఎవ్వరి జోలికీ వెళ్లే వాడు కాదు. అలాంటి అతడ్ని ఇలా చేయని తప్పుకు బలి తీసుకోవటం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూంలో తెలియజేయండి.