అత్తింటివాళ్ల వేధింపులు ఎక్కవయ్యావని, భర్త వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని ఇలా అనేక కారణాలతో కొందరు నవ వధువులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ స్టోరీకి విరుద్దంగాఓ యువకుడు పెళ్లైన 38 రోజులకే నవ వరుడు సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా శోకసంద్రంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమక ప్రాంతంలోని వైఎస్ఆర్ నగర కాలీనికి చెందిన సన్నీ అనే 21 ఏళ్ల యువకుడు ఈ మధ్యే ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక సన్నీ మధిరలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లై కొన్ని రోజులు హాయిగా గడిపాడు. అయితే ఈ మధ్యకాలం నుంచి సన్నీకి అతను పని చేసే కంపెనీ నుంచి పని ఒత్తిడి చేయటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో రోజు కంపెనీ నిర్వహకులు వరుస వేదింపులకు గురి చేయటంతో తట్టుకోలేకపోయాడు.
ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లైన 38 రోజులే గడవటంతో బరువెక్కిన హృదయం తో నేను చచ్చిపోతున్నానని.. నా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన భావ మొబైల్ కు మెసేజ్ పెట్టి స్థానిక రైల్వే పట్టాలపైన సూసైడ్ చేసుకున్నాడు. ఇక వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, భార్య బోరున విలపించారు. ఇక శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై విచారిస్తున్నారు.