కొన్ని సార్లు తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అదే శ్వేత విషయంలోనూ జరిగింది. ప్రియుడితో కలిసి ఆమె చేసిన ఆ తప్పు ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
మనుషులు అన్న తర్వాత తప్పులు చేయటం సహజం. ఆ తప్పు సరిదిద్దుకునేది అయితే.. జీవితంలో ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. చేసిన తప్పు కారణంగా జీవితమే నాశనం అయితే.. ఇంతకు మించిన విషాదం అంటూ ఏదీ ఉండదు. శ్వేత జీవితంలోనూ ఇదే జరిగింది. ప్రియుడితో కలిసి ఆమె చేసిన తప్పు చిన్న వయసులోనే ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన శ్వేత అనే 21 ఏళ్ల యువతి గోపిచెట్టిపాళ్యంలోని ఓ కాలేజ్‌లో బీఎస్‌సీ చదువుతోంది.
ఆమె గత నెల 28వ తేదీనుంచి కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొంకరపాళ్యంకు చెందిన 23 ఏళ్ల లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. లోకేష్, శ్వేత గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరు పలుమార్లు శారీరకంగా కలిశారు. తాను గర్భం దాల్చినట్లు శ్వేతకు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని లోకేష్‌కు చెప్పింది. గర్భం విషయం బయట తెలిస్తే పరువు పోతుందని ఇద్దరూ భావించారు.
గుట్టుచప్పుడు కాకుండా గర్బం తీయించుకోవాలని అనుకున్నారు. 28న ఇద్దరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. శ్వేతను పరీక్షించిన వైద్యుడు పిండం బాగా పెరిగిందని, ఆబార్షన్ చేయటానికి కుదరదని చెప్పాడు. దీంతో శ్వేత కలత చెందింది. లోకేష్ ఆమెను తన తాత గారి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంది. శ్వేత మరణం తనకు ముప్పు అవుతుందని భావించిన అతడు.. ఆమె శవాన్ని గోనే సంచిలో కట్టి ఓ బావిలో పడేశాడు. పోలీసులు శ్వేత శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. మర్డర్ కేసును, సూసైడ్ కేసుగా మార్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.