విద్యార్థులకు పాఠాలు చెబుతూ భవిష్యత్ లో మార్గదర్శకంగా ఉండాల్సిన గురువులే చెడుదారిన వెళ్తు సభ్య సమాజానికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు ఓ దుర్మార్గపు గురువు. కడప జిల్లా యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఓ ప్రొఫెసర్ వెకిలి చేష్టల గుట్టు ఒక్కొక్కటిగా కదులుతోంది. యూనివర్సిటీలోని ఉద్యోగులను లోబరుచుకుంటూ లైంగిక కోరికలు తీర్చకుంటున్నాడు. రోజు లాగే ఓ మహిళా విశ్వ విద్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తోంది. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే అదే విశ్వ విద్యాలయంలో బాధ్యతలు నిర్వ్హహిస్తున్నాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ప్రొఫెసర్.
అందంగా కనపడిన మహిళా ఉద్యోగులపై కన్నేస్తూ..లైంగికంగా వేధించటం మొదలు పెట్టాడు. భవిషత్ తరాలకు మార్గదర్శకుడిగా ఉండల్సిన గురువే నేడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాడు. ఎప్పటిలాగే ప్రతి ఆదివారం ఉద్యోగులకు సెలవు కావటంతో అందరు హాలిడేలో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రొఫెసర్ మాత్రం యూనివర్సిటికి వచ్చాడు. ఉద్యోగం మీదున్న ఇష్టం అనుకుంటే పొరపాటే..ఇక ఆదివారం పక్క ప్లాన్ ప్రకారమే వచ్చిన ఆయన..ఓ మహిళ ఉద్యోగికి ఫోన్ చేశాడు. అర్జెంట్ గా ఆఫీసుకి రావాలంటూ ఆ ఉద్యోగికి చెప్పడంతో కాదనలేక ఆమె వచ్చింది. ఏదో ఆఫీస్ పని నిమ్మితం అని నమ్మిన ఆ ఉద్యోగిని పరుగులు పెడుతూ వచ్చింది.
ఇక వచ్చిన ఉద్యోగిని ఒంటరిగా ఓ గదిలోకి తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ అక్కడ తాకడం, అసభ్యకరంగ ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇక ఆ మహిళా భయంతో షాక్ గురై పరుగులు పెడుతూ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఆ ప్రొఫెసర్ ను మందిలించడం మొదలు పెట్టారు. ఆ ప్రొఫెసర్ మాట్లాడిన తీరును ఆమె ఫోన్ లో వాయిస్ రికార్డు ను విశ్వ విద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ సభ్యుల ముందు ఉంచింది. దీంతో అయ్యగారి లెక్కలు ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదిలింది. ఇలా గతంలో చాల మంది ఉద్యోగులను వేధించినట్లు తెలిసింది. దీంతో ఆయనపై పై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.