తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు దొంగలు చుక్కలు చూపించారు. ఒకేసారి 20 నుంచి 25 మంది దొంగలు రైలులో దూరి భారీ దోపిడికి పాల్పడ్డారు.
ఈ రోజుల్లో చాలా మంది ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎంతటి దారుణాలకైన పాల్పడుతున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి దూరి దోపిడీ చేసేవారు.. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. రైల్వే స్టేషన్లలో రైలు ఆగడం చూసి దొంగతనానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు దొంగలు ఓ రైల్ లో దొంగతనానికి పాల్పాడ్డారు. తాజాగా ఈ ఘటన తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు రాత్రి 7:30 కి బయలుదేరుతుంది. కానీ, శుక్రవారం మాత్రం ఓ గంట ఆలస్యంగా బయలు దేరింది. అయితే కడప జిల్లా కమలాపురం దాటిన తర్వాత ఓ సిమెంట్ పరిశ్రమ సమీపంలో ఓ చోట అర్ధరాత్రి 11:30 గంటలకు రైలు ఆగింది. ఆగిన వెంటనే ఒక్కసారిగా ఏకంగా 20 నుంచి 25 మంది దొంగలు రైలులోకి వచ్చేశారు. ఎస్ 1బోగి నుంచి మెుదలుపెడితే ఎస్5 బోగి వరకు దొంగలు ఆ రైల్ లో దూరి కిటికీ దగ్గర ఉన్న ప్రయాణికులను టార్గెట్ గా చేసుకొని వాళ్ల దగ్గర ఏదీ దొరికితే అది దోచుకున్నారు.
ఆ దొంగల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడులు కూడా చేశారు. దీంతోపాటు ఎస్ 3 బోగిలో ఉన్న నలుగురు మహిళల వద్ద బంగారు ఆభరణాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురు మహిళలు ఎదురు తిరగడంతో చాకచక్యంగా ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ తర్వాత బాధితులంతా ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే ఏకంగా 20 నుంచి 25 మంది దొంగలు ఒకేసారిగా రావడం ప్రయాణికులు అంతా ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఈ దోపడి ఆ దొంగలు పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో మరింత భద్రత పెంచాలని ప్రయాణీకులు కోరారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో రైల్వే ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే జంకుతున్నారు.