అది చెన్నైలోని తిరుమంగళం ప్రాంతం. సరోజ అనే మహిళకు 13 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల కిందట భర్త చనిపోవటంతో సొంతకాళ్లపై నిలబడి ఇద్దరిని సాదుతూ వస్తుంది. అలా ఆమె జీవితం అదోమాదిరిగా సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే కూతురు స్కూల్ కు వెళ్లే వ్యాన్ డ్రైవర్ తో సన్నిహితంగా మెలుగుతూ చివరికి అతనినే పెళ్లి చేసుకుంది తల్లి సరోజ. అలా గడుస్తున్న జీవితంలో రెండవ భర్త కసాయి అవతారానికి ఎత్తాడు.
ఇక ఓ రోజు సరోజ కూతురు, కుమారుడికి ఈత నేర్పాలని భావించటంతో ఇద్దరిని తీసుకెళ్లాడు. కానీ అక్కడ సరోజ కూతురిపై అతను ప్రవర్తించిన తీరు మాత్రం దారుణంగా ఉంది. ఆ బాలిపై అసభ్యకరంగా ప్రవర్తించటంతో ఈ విషయాన్నికూతురు తల్లికి చెప్పింది. దీంతో తల్లి సరోజ వెంటనే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి కొన్నాళ్లు న్యాయం కోసం ఎదురు చూసింది.
కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఇక వెంటనే ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అలా వెళ్లిన సరోజకు ఊహించని పరిణామం ఎదురైంది. కూతురిపై జరిగిన దారుణంపై న్యాయంపై కోరిన క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా ఖంగు తినేంత పనైంది. నీకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రూ.5000 చెల్లించాల్సిందేనని చెప్పారు. ఇది కాకుంటే మాత్రం స్టేషన్ మొత్తం శుభ్రమైన చేయాలని తెలిపారు. అలా అయితేనే నీ కుతురికి న్యాయం చేస్తామని పోలీసులు కరాకండిగా చెప్పేశారు. దీంతో పోలీసుల తీరుకు విసుగుచెందిన సరోజు డీసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పై అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.