ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కీలక నేతను కొందరు గుర్తు తెలియన దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఓ బీజేపీ నేతను కొందరు గుర్తు తెలియని దుండుగులు తుపాకులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌కు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు రాజు ఝా తాజాగా తన సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి రాక కోసం కొందరు గుర్తు తెలియని దుండుగులు అప్పటికే కాపుకాచి ఉన్నారు.
ఇక రాజు ఝా శక్తిగఢ్ ప్రాంతంలోకి రాగానే వారి ప్లాన్ అమలు చేశారు. పక్కా ప్లాన్ తో రాజు ఝాపై దుండగులు తుపాకులతో కాల్పులు రిప అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అతడు చనిపోయాడని తెలుసున్న తర్వాత ఆ దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రాజు ఝా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. రాజు ఝా మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.