ఈ మధ్యకాలంలో చాలా మంది క్షణికావేశంలో నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువుల్లో రాణించలేకపోతున్నానంటూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఈ అమ్మాయి ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వరంగల్ జిల్లా సురారం గ్రామంలో రమేష్, మమత దంపతుల నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరి కుమార్తె అయిన హాసిని (15) హాసన్పర్తిలోని ఓ స్కూల్ లో 10వ తరగతి చదువుతుంది. స్కూల్ లో ఇటీవల ఉపాధ్యాయులు నిర్వహించిన పరీక్షలో హాసినికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవుల్లో ఆ బాలిక ఇంటికి వెళ్లింది. ఇక సెలవుల అనంతరం హాసిని స్కూల్ కు వెళ్లడం లేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే హాసిని మరింత కృంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది.
దీనిని గమనించిన హాసిని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలిక అప్పటికే మరణించిందని నిర్ధారించారు. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగానే ఆ బాలిక చనిపోయినట్లు సమాచారం. అనంతరం ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.