అవును.. ఒక్క మిస్డ్ కాల్, ఆమె జీవితాన్నే నాశనం చేసింది. వినటానికి సినిమా డైలాగ్ లా ఉన్న ఇది నిజం. తెలియని వ్యక్తితో పరిచయమే ఆమెను నిండా ముంచింది. ఇంతకు ఏం జరిగిందంటే?
కొన్ని అనుకోని పరిచయాలు మంచి బంధాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ పరిచయం ఇద్దరికీ ఎన్నో మధురమైన జ్ఞపకాలు మిగులుస్తాయి. కానీ, మరి కొన్ని పరిచయాల్లో మాత్రం జీవితంలో మాయని మచ్చని, చేదు జ్ఞపకాలుగా మిగిలిపోతాయి. అయితే, అచ్చం ఇలాగే ఓ మహిళకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చిది. అదే కాల్, ఆమె జీవితాన్నే పూర్తిగా నాశనం చేసింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఆ వ్యక్తి పరిచయం అనంతరం జరిగిన పరిణామాలు ఏంటనే పూర్తి వివరాలు మీకోసం.
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన సౌజన్య అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి వరకు ఆమె జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే తిరుపతి అనే అపరిచిత వ్యక్తి నుంచి ఆమె ఫోన్ కు మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరనేది తెలుసుకోవడానికి సౌజన్య అతనికి రిటర్న్ కాల్ చేసింది. వీరిద్దరు ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అలా వీరి ఫోన్ కాల్ పరిచయంతో వీళ్లు మరింత దగ్గరయ్యారు. ఇద్దరు తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇక రాను రాను వీళ్లు మరింత దగ్గరయ్యారు.
దీనినే ఆసరాగా చేసుకున్న తిరుపతి.. ఎన్నో మాయ మాటలు చెప్పి సౌజన్యతో చాలా సార్లు చనువుగా వీడియో కాల్స్ మాట్లాడాడు. ఇదంతా ఆమెకు తెలియకుండా తిరుపతి రికార్డ్ చేసుకున్నాడు. ఇక అదే వీడియోలను సౌజన్యకు పంపి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇదే విషయం ఆమె భర్తకు తెలియడంతో సౌజన్య పాక్ గురైంది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియక నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.