ఏ తల్లి అయినా తన కూతురుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు చిన్న గాయమైన అస్సలు తట్టుకోదు. ఇక కూతురుకి పెళ్లి వయసు రాగానే మంచి యువకుడితో పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ, ఓ తల్లి మాత్రం.. వ్యభిచారం చేయాలంటూ కూతురుని వేధింపులకు గురి చేసింది.
మా అమ్మ వ్యభిచారం చేయాలంటూ గత కొన్నేళ్ల నుంచి నన్ను బాగా టార్చర్ చేస్తుంది. నేను అడ్డు చెబితే కొడుతుంది. ఇలా ఉండకుండా మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలని, బాడీ గ్రోత్ రావడానికి ఎన్నో రకాల టాబ్లెట్స్ కూడా వేసిందని, నన్ను రక్షించాలంటూ ఈ బాలిక తాజాగా విజయనగంర పోలీసులను ఆశ్రయించింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
బాధిత బాలిక కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరంలోని ఓ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఈమె చాలా ఏళ్ల కిందటే ఓ బాలిక (16)ను దత్తత తెచ్చుకుని పెంచుకుంటుంది. అయితే, ఈ మహిళ వ్యభిచారం చేస్తూ ఉండేది. ఈ వ్యవహారాన్ని ఈమె చాలా కాలంగా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆమె పెంచుకుంటున్న కూతురు ఈ మధ్యే పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తాను వ్యభిచారం చేస్తున్నది కాకుండా తన కూతురుని కూడా పడుపు వృత్తిలోకి లాగాలని అనుకుంది.
ఇందులో భాగంగానే ఆ మహిళ తన కూతురుకి తెలియకుండా బాడీ గ్రోత్ కోసం ఎన్నో రకాల టాబ్లెట్ వేసింది. దీంతో పాటు మోడ్రన్ దుస్తువులు ధరించేలా చేసి ఆ తర్వాత ఫొటోలు తీసి సినిమా డైరెక్టర్లకు పంపిస్తుంది. మరో దారుణం ఏంటంటే? పలువురి వ్యక్తుల వ్యభిచారం చేయాలంటూ ఆ మహిళ తన కూతురుని గత కొన్ని రోజుల నుంచి టార్చర్ పెడుతుంది. దీనిని కూతురు ప్రశ్నించడంతో తిరిగి ఆ బాలికపైకి దాడికి దిగింది. ఇక రోజు రోజుకు ఆ మహిళ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. తాజాగా రాత్రి 11 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. నాకు రక్షణ కల్పించాలని కోరుతు కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఫిర్యాదు అనంతరం ఆ బాలిక మీడియతో మాట్లాడుతూ.. నా తల్లి వ్యభిచారం చేయాలంటూ చాలా రోజుల నుంచి నన్ను బాగా వేధింపులకు గురి చేస్తుంది. నేను అడ్డు చెబితే కొడుతుంది. ఇలా ఉండకుండా మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలని, బాడీ గ్రోత్ రావడానికి ఎన్నో రకాల టాబ్లెట్స్ కూడా వేసిందని వాపోయింది. ఇది భరించలేక రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించానని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక నాకు చదువుకోవాలని ఉన్నా.. చాలా రకాలుగా ఇబ్బందుకు గురి చేస్తుంది. అయినా సరే నిరుత్సాహ పడకుండా బాగా చదువుకుంటునానని తెలిపింది. ఇక నా తల్లి నుంచి నాకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించానని ఆ బాలిక చెబుతున్న మాటలు పలువురుని కంటతడి పెడుతున్నాయి. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచారం చేయాలంటూ కూతురుని వేధిస్తున్న ఆ దుర్మార్గురాలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.