మన దేశంలో రోజుకొక చోట అత్యాచార దాడులు జరుగుతూనే ఉన్నాయి. గుడి, బడి, రైల్వే స్టేషన్ ఇలా ఏదీ వదలకుండా దుర్మార్గులు రెచ్చిపోయి గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. సరిగ్గా ఇలాగే వక్రబుద్ది చూపించిన ఓ ఆస్పత్రి వైద్యుడు.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లేక్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఓ మహిళ మంగళవారం రక్త పరీక్షలు కోసం వచ్చింది.
ఈ క్రమంలోనే ఈసీజీ చేసుకోవాలంటూ వైద్యులు ఆమెకు సూచించారట. ఇక అదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు ఈసీజీ చేసుకోవాలంటూ ఆ మహిళను గదిలోకి పిలిచినట్లు తెలుస్తోంది. గదిలోకి వచ్చిన ఆ మహిళపై ఈ కేటుగాడు అక్కడక్కడ చేతులు వేస్తూ తడిమే ప్రయత్నం చేశాడట. ఇక ఇంతటితో ఆగకుండా ఆ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే గమనించిన ఆ మహిళ ఆ వైద్యుడి చెర నుంచి తప్పించుకుని బయటపడింది.
ఇదే విషయాన్నిబాధిత మహిళ.., కుటుంబ సభ్యులు తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే? పోలీసులు బాధిత మహిళను విచారించగా.. అటువంటి ఘటనలు ఇక్కడ ఏం జరగలేదంటూ లిఖిత పూర్వకంగా పేర్కొనడం విశేషం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో మహిళ ప్రవర్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.