పోలీసులకు ఎవరైన అర్థరాత్రి డయల్ 100కి కాల్ చేయాలంటే దొంగతనం కేసు అయిన అయ్యిండాలి, లేదంటే ఏదైన గొడవనైన జరిగుండాలి. ఇలాంటి అత్యవసర సమయంలోనే మామాలుగా మనం డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదులు చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి చుక్కలు చూపించాడు. మనోడు అడిగిన సాయానికి పోలీసులే బిత్తరపోయారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ చేశాడు. అర్థరాత్రి ఆ వ్యక్తి పోలీసులను ఏం సాయం అడిగాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్ గ్రామం. గురువారం రాత్రి 2 గంటల సమయం. ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేశాడు. సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు అర్జెంట్ గా నా వద్దకు రావాలని పోలీసులును కోరాడు. దీంతో మనోడు భయంగా భయంగా మాట్లాడడంతో ఏం జరిగిందోనని డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు హుటాహుటిన అక్కడికికి పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Telangana: కూతురి ప్రియుడిని చంపేందుకు తండ్రి ప్లాన్.. హత్యకు 5 లక్షల సుపారీ!
తీరా పోలీసులు అక్కడికి వెళ్లగానే మద్యం మత్తులో తాగుతున్న ఆ యువకుడు సార్.. నాకు రెండు బీర్లు కావాలి అని అనడంతో పోలీసులు విస్తుపోయారు. ఇక కోపంతో ఊగిపోయిన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు స్టేషన్ కు తరలించారు. డయల్ 100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన ఆ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.