తెలంగాణలోని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ ఖాన్ పేట. ఇదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు గచ్చిబౌలీలో MT సెక్షన్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, వెంకటేష్ తాజాగా తన గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వెంకటేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటేష్ మరణవార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.