ఈ మద్య దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సినీ ఇండస్ట్రీలో కొంత మందిని చంపుతామని బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీలో నటుడు శివరంజన్ బొలన్నవర్పై ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. తనపై అటాక్ చేస్తున్న విషయం గమనించిన శివరంజన్ సినీ ఫక్కీలో తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో వీరభద్ర, బిసి రక్త, ఆట హుడుగాట, అమృత సింధు తదితర సినిమాల్లో శివరంజన్ హీరోగా నటించాడు. శివరంజన్ బెళగావి జిల్లాలోని బైళహొంగల సొంత ఊరికి ఖాళీగా ఉన్న సమయంలో వెళ్తుంటారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను చూసేందుకు మంగళవారం రాత్రి వెళ్లారు.
సొంత ఊరిలో తన ఇంటి బయట శివరంజన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే దుండగులు బైక్ పై వచ్చి శివరంజన్ ని పలుకరించినట్లు నటించి కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన ఆయన తప్పించుకున్నాడు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు.
నటుడు శివరంజన్ పై ఫైరింగ్ జరిగినట్లు తెలుసుకున్న బెళగావి జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ తన టీమ్ లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. శివరంజన్ ఇచ్చిన వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాల్పుల నుంచి సురక్షితంగా తప్పించుకున్నారని ఎస్పీ తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం అక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రముఖ నటి శృతి, శివరంజన్ కలిసి అమృతసింధు ఆయనకు ఎంతో మంచి పేరు సంపాదించి పెట్టింది.
ఇది చదవండి: Rithu Chowdary: జాగ్వారు కారుతో జబర్దస్త్ రీతూ చౌదరి ఫోజులు.. ధర ఎంతంటే?