ఈ మద్య దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సినీ ఇండస్ట్రీలో కొంత మందిని చంపుతామని బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీలో నటుడు శివరంజన్ బొలన్నవర్పై ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. తనపై అటాక్ చేస్తున్న విషయం గమనించిన శివరంజన్ సినీ ఫక్కీలో తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ ఇండస్ట్రీలో వీరభద్ర, బిసి రక్త, ఆట హుడుగాట, అమృత సింధు తదితర సినిమాల్లో శివరంజన్ హీరోగా నటించాడు. […]