కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక్క వెలుగు వెలిగిన కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయులు శివ, రాఘవేంద్ర, పునీత్ రాజ్ కుమార్. శివన్న, పునీత్ రాజ్ కుమార్ లు టాప్ హీరోలుగా రాణించారు. 2021 లో గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు.. దీంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి కన్నడ కంఠీరవుడిగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కుమార్. కన్నడ చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందని అంటారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రాజ్ కుమార్ తనయులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర, పునీత్ రాజ్‌కుమార్. కన్నడ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలుగా శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్ లు పేరు తెచ్చుకున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో సినీలోకం ఒక్కసారే శోకసంద్రంలో మునిగిపోయింది. తాజాగా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు రాఘవేంద్ర తన తమ్ముడిపై అభిమానం చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో వపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు దివంగత పునీత్ రాజ్ కుమార్. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనను ముద్దుగా ‘అప్పు’ అని పిలుస్తారు. 2021 లో తన ఇంట్లో జిమ్ చేస్తుండగా హఠాత్తుగా హార్ట్ స్టోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్‌ను శోకసంద్రంలో ముంచేశాడు. పునీత్ అంటే ఇద్దరు సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ లకు ఎంతో ఇష్టం.. ఎక్కడికి వెళ్లినా ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్తుంటారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు తమ సోదరుడి ఫోటో కనిపించినా.. జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా దుఖఃన్ని ఆపుకోలేక ఏడ్చేస్తుంటారు.
ఈ క్రమంలో తమ్ముడి పేరు గుర్తుండిపోయేలా ఉండేందుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ ఏకంగా తన ఛాతిపై అప్పు అని పేరు టాటూ వేయించుకున్నాడు. అప్పు పేరుతో పాటు టోటో, సుక్కీ పేర్లు కూడా టాటూగా వేయించుకున్నారు. అవి పునీత్ రాజ్ కుమార్ కూతుళ్లు ముద్దుపేర్లు. వారి అసలు పేర్లు ధృతి, వందిత. రాఘవేంద్రకు తమ్ముడు అంటే పంచప్రాణాలు.. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో బాగా అభిమానించేవారు. 46 ఏళ్ల వయసులోనే పునీత్ కన్నుమూయడంతో రాఘవేంద్ర ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే తమ్ముడి పేరు తన చాతిపై టటూ రూపంలో వేయించుకున్నాడు. తాజాగా రాఘవేంద్ర పచ్చబొట్టుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ
— Sagar Manasu (@SagarManasu) May 28, 2023