Crime News: ప్రేమ పెళ్లైన మూడు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అత్తారింట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మొరాదాబాద్ జిల్లాలోని కోత్వాలి మొఘల్‌పురాకు చెందిన సోనమ్ మొదటి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆమెకు అజయ్ దివాకర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
మూడు నెలల క్రితం ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత అజయ్ తన భార్య సోనమ్‌తో కలిసి హిమగిరి కాలనీలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ, గురువారం అత్తింట్లో సోనమ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు సందర్భంగా దొరికిన ఆధారాలను బట్టి ముందుకెళతామని పోలీసులు తెలిపారు. ఇక, తమ కూతుర్ని అత్తింటి వారే చంపేశారని సోనమ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: నడి రోడ్డుపై వ్యక్తిపై దారుణం.. అందరూ చూస్తుండగానే..