Crime News In Telugu: అన్నం తింటున్నప్పుడు పదే పదే మామిడి పండు అడిగి విసిగించిందన్న కోపంతో మేనకోడల్సి చంపాడో వ్యక్తి. బాలికను దారుణంగా కొట్టి, గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, శ్యామిలిలోని ఖేదా కుర్తాన్ గ్రామానికి చెందిన కైరు నిషా అనే ఐదు సంవత్సరాల బాలిక మేన మామ ఉమర్ దీప్ ఇంట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం ఉమర్ దీప్ భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు. కొద్ది సేపటి తర్వాత నిషా అక్కడికి వచ్చింది. మామిడి పండు కావాలని మామను అడిగింది.
ఇలా చాలా సార్లు అడిగింది. దీంతో ఉమర్ ఆగ్రహానికి గురయ్యాడు. తాను అన్నం తింటుంటే ఇబ్బంది పెడుతోందని రాడ్డుతో నిషా తలపై గట్టిగా కొట్టాడు. దీంతో నిషా తల పగిలి రక్తం కారటం మొదలైంది. అది గమనించిన ఉమర్ భయపడిపోయాడు. విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు మొదలవుతాయని భావించాడు. వెంటనే నిషా గొంతును కత్తితో కోసి చంపాడు. అనంతరం చిన్నారి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కాడు. గోనె సంచిని తీసుకెళ్లి ఊరికి దగ్గర్లో ఉన్న అడవిలో పడేశాడు. పాప కనిపించకపోవటంతో ఇతర కుటుంబసభ్యులు వెతకటం మొదలుపెట్టారు.
ఉమర్ ఎవరికీ అనుమానం రాకుండా వారితో పాటు బాలికను వెతకటంలో సహాయం చేశాడు. ఎంతకీ పాప కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పాప కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గురువారం అడవిలో చిన్నారి శవం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉమర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడి వద్దనుంచి కత్తి, రాడ్డును స్వాధీనం చేసుకుని, జైలుకు తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Warangal: తెల్లవారితే శుభకార్యం జరగాల్సిన కుటుంబం.. అంతలోనే..