Crime News: సాధారణంగా ప్రియురాలిని కలవటానికి వెళ్లి ప్రియుడు దెబ్బలు తినటం జరుగుతుంటుంది. అలాంటి సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.. ఇకపై జరుగుతాయి కూడా. కానీ, ఇందుకు భిన్నంగా ఓ సంఘటన జరిగింది. ప్రియుడ్ని కలవటానికి వెళ్లి ఓ యువతి అడ్డంగా దొరికిపోయింది. అర్థరాత్రి గ్రామస్తుల చేతికి చిక్కి దెబ్బలు తింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఓ ఐదు రోజుల క్రితం ఓ రాత్రి యువతి తన ప్రియుడ్ని కలవటానికి అతడి ఊరు పురాణ గ్రామానికి వెళ్లింది.
అక్కడ సదరు యువతీ, యువకుడు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు వారి దగ్గరకు వచ్చారు. ఇద్దరూ ఏం చేస్తున్నారని అడిగారు. వారు సమాధానం చెప్పలేకపోకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు యువకుడ్ని వదిలేసి, యువతిని ఓ గేటుకు కట్టేశారు. కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. ప్రియురాలిని కొట్టడం చూసి జడుసుకున్న ప్రియుడు అక్కడినుంచి పరారయ్యాడు. గ్రామ మహిళలు మాత్రం యువతిని చావకొట్టారు. కొందరు దాన్ని వీడియో కూడా తీశారు.
ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు యువతీ, యువకుడికి ఇదివరకే వేరే వ్యక్తులతో పెళ్లి అయిందని, వేరు వేరు కుటుంబాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. చాలా కాలం నుంచి వారు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చిన్న వయసులో ప్రేమించుకున్నారు.. ఎవరూ లేని టైమ్ చూసి!