ఆమె కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడింది. భవిష్యత్ లో గొప్పగా ఎదిగి ఉన్నతమైన హోదాలో ఉండాలన్న ఆశతో ముందుకువెళ్తోంది. ఇక అంతా మంచే జరుగుతుంది అనుకున్న క్రమంలోనే ఆ యువతి అనుమానాస్పదస్థితిలో అపార్ట్ మెంటుపై నుంచి పడి మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యూపీలోని తల్కటోరా ప్రాంతానికి చెందిన యువతి జులై 21న నుంచి వేదాంత ఆస్పత్రిలో నర్స్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ట్రైనింగ్ తీసుకుంటూ గోమత నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ…, ఆ యువతి ఉన్నట్టుండి ఇటీవల గోమతనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ 14 వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఆమె ధరించి ఉన్న దుస్తువులు చినిగి ఉన్నాయి. దీంతో ఎవరైన హత్య చేశారా? లేక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.