ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని రెండేళ్ల పసికందును ఓ మహిళను గొంతు పిసికి చంపి, అనంతరం శరీర భాగాలను ఎవరికీ కనిపించకుండా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో రమేష్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై రెండేళ్ల బిడ్డ కూడా ఉంది. అయితే ఇటీవల రమేష్ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాలని చెప్పి బిడ్డను తన తల్లి వద్ద ఉంచి వెళ్లాడు.
ఇదిలా ఉంటే రమేష్ కుామర్ అన్నకు పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. కానీ పుట్టిన బిడ్డలు పుట్టినట్లే మరణిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ అన్న, వదిన సరోజ్ దేవి (35)కి ఏం చేయాలో తెలియక ఇటీవల ఓ మాంత్రికుడిని ఆశ్రయించారు. అతని ఆదేశాల మేరకు రమేష్ వదిన సరోజ్ దేవి మరిది బిడ్డను గొంతు పిసికి హత్య చేసి తల, మొండం స్థానికంగా చెరుకు తోటలో పడేసింది. ఇక సాయంత్రమైన కూతురు జాడ కనిపించకపోవడంతో రమేష్ అన్న, వదినలపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే ఓ పసిబిడ్డ శరీర భాగాలు ఆ గ్రామంలోని చెరుకు తోటలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే తండ్రి రమేష్ ఘటన స్థలానికి చేరుకుని చూడగా తన కూతురేనని నిర్ధారించుకున్నాడు.
కన్న బిడ్డను దారుణంగా హత్య చేయడంతో భార్యాభర్తలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత రమేష్.. వదినపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా సరోజ్ దేవిని విచారించగా అసలు విషయం బయట పెట్టింది. నాకు పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోతున్నారని, ఈ సారి పుట్టబోయే బిడ్డ బతకాలంటే ఇలా చేయాలని మాంత్రికుడు చెప్పడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని సరోజ్ దేవి ఒప్పుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మంత్ర, తంత్రాల నెపంతో పసిబిడ్డ ప్రాణాలు తీసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.