గత కొంత కాలంగా టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేయడంలో విఫలం అవుతూ వస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ లో వైఫల్యం చెందుతూ.. పరాజయాలను మూటగట్టుకుంది. అయితే భారత బౌలర్లు అందరు విఫలం అవుతున్న వేళ టెస్టు ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఉమేష్ యాదవ్. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆసియా పిచ్ లపై చెలరేగడలో ఉమేష్ యాదవ్ సిద్దహస్తుడు. ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు ఉమేష్ యాదవ్. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ బౌలర్లు అయిన కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి హేమాహేమీలను కూడా వెనక్కినెట్టాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో బంగ్లా బ్యాటర్ అయిన యాసీర్ అలీ వికెట్ తీశాడు ఉమేష్ యాదవ్. ఈ వికెట్ తీయ్యడంతో పాక్ దిగ్గజ బౌలర్ అయిన వసీమ్ అక్రమ్ ను వెనక్కి నెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఉపఖండపు పిచ్ లపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉమేష్.. వసీమ్ అక్రమ్ ను వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా తరపున ఆసియా పిచ్ లపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. ఉమేష్ యాదవ్ 37 టెస్టుల్లో 49.2 బౌలింగ్ స్ట్రైక్ రేట్ తో 110 వికెట్లు తీస్తే.. అక్రమ్ 59 మ్యాచ్ ల్లో 52.4 స్ట్రైక్ రేట్ తో 216 వికెట్లను నేలకూల్చాడు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ అక్తర్, ఇమ్రాన్ ఖాన్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక 6వ స్థానంలో జవగళ్ శ్రీనాథ్, 7వ స్థానంలో కపిల్ దేవ్ లు ఉన్నారు. తర్వాతి ప్లేసుల్లో చామింద వాస్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.
Umesh Yadav “in Asia” is extraordinary. pic.twitter.com/cmS0sn3KMa
— Johns. (@CricCrazyJohns) December 17, 2022