వరకట్నమనేది సామాజిక దురాచారం అంటూనే చాలా మంది కట్నం లేనిదే పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లైన కొంతకాలానికి అదనపు కట్నం తీసుకురావాలంటూ హింసించి హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
నిండు నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లినాటి ప్రమాణాలు కాలరాస్తూ చిన్న చిన్న కలహాలతో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి చేరుతున్నారు. ఆర్థిక, వివాహేతర కారణాల వల్ల పెళ్లైన కొంతకాలానికే దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతమంది విడాకులు తీసుకుంటుంటే.. మరికొంతమంది ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇక వరకట్న దాహానికి ఎంతోమంది ఆడవాళ్లు బలైన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా వరకట్నం గొడవ కారణంగా మహిళ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. వరకట్నం నిషేదించాలని చెబుతున్నప్పటికీ అది మాటల వరకే పరిమితం అవుతుంది. వరకట్నం స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్ర హింసలు, నేరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వరకట్న దాహానికి పేదవారుగాని, మధ్యతరగతివారు గాని, సంపన్న స్త్రీలు ప్రతిఒక్కరూ బలి అవుతున్నారు. తాజాగా భార్యాభర్తల మధ్య అదనపు కట్నం గొడవ భార్య హత్యకు దారితీసింది. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించాడు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆదివారం రాత్రి చిగురు సంధ్యను ఆమె భర్త చిగురు గణేష్ రోకలిబండతో కొట్టి చంపినట్లు గ్రామస్థులు తెలిపారు.
కాటారం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన సంధ్యతో ఒడిపిలవంచ గ్రామానికి చెందిన గణేష్ తో 7 సంవత్సరాల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొత్తలో దంపుతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ జంటకు పాప, బాబు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇటీవల సంధ్యను గణేష్ తనకు అదనపు కట్నం తీసుకురావాలని గొడవ పెట్టుకోవడంతో పలుమార్లు పుట్టింటికి వెళ్లి తన బాధను చెప్పుకుందని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన గణేష్ ని కఠినమైన శిక్ష పడాలని వారు అంటున్నారు. కాటారం ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని నిందుతుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సమాచారం.