కుమారుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని తల్లిదండ్రులు ఎంతో సంబరపడి పోతారు. కానీ, ఎందరో కుమారులు తల్లిదండ్రులకు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నారు. కన్న పాపానికి వాడిని భరించక తప్పదు అని క్షోభపడుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఘనుడి గురించే. పూటుగా తాగొచ్చి కన్న తల్లినే కడ తేర్చాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం అడ్డులలో జరిగింది ఈ దారుణం. రేగం అర్జులమ్మ- రామన్న దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దకుమారుడు, కుమార్తెలకు వివాహాలు జరిగిపోయాయి. చిన్న కుమారుడు మత్స్యలింగంతో కలిసి అర్జులమ్మ, రామన్నదొర నివసిస్తున్నారు. చిన్నకుమారుడు మద్యానికి బానిసగా మారాడు. రోజూ తాగొచ్చి గొడవ చేస్తుంటాడు. ఆదివారం కూడా అలాగే పూటుగా మద్యం తాగొచ్చాడు. నిద్రపోతన్న తల్లిని లేపి అన్నం పెట్టమన్నాడు. ఆ రోజు చేసిన రసం వేసి అర్జులమ్మ మత్స్యలింగానికి అన్నం పెట్టింది. రసం ఒక్కటేనా.. కూర ఏం లేదా అంటూ తల్లితో గొడవకు దిగాడు.
ఇంట్లో రసం ఒక్కటే చేశాను.. కూర ఏమీ చేయలేదంటూ తల్లి నచ్చజెప్పాలని చూసింది. మద్యం మత్తులో కుమారుడు కోపంతో ఊగిపోతున్నాడు. తల్లిపై చేయి చేసుకున్నాడు కూడా. తండ్రిని కూడా బెదిరించడంతో పెద్ద కుమారుడిని పిలుచుకు వచ్చేందుకు రామన్నదొర పరుగులు పెట్టాడు. పొద్దున్నే వచ్చి చూడగానే అర్జులమ్మ మరణించి ఉంది. మద్యం మత్తు- కోపంలో మత్స్యలింగం అక్కడే ఉన్న గొడ్డలితో తల్లి తలపై గట్టిగా కొట్టినట్లున్నాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు ఉంది. అక్కడ నుంచి మత్స్యలింగం పరారయ్యాడు అంటూ రాజన్ననదొర విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మత్స్యలింగం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కూర కోసం కన్నతల్లిని హతమార్చిన గొప్ప కుమారుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సరయుతో బిగ్ బాస్ టీంకు కొత్త తలనొప్పి