సమాజంలో నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఘటనలు మాత్రం చాలా దారుణమైనవి ఉంటాయి. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఈ ఘటన కూడా అలాంటిదే. 12 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు దండగులు. అంతటి ఆగక.. చనిపోయిన తరువాత కూడా అత్యాచారం చేశారు. హర్యానాలోని పానిపట్‌లో 4 ఏళ్ల క్రితం ఈ దారుణం జరిగింది. నాటి కేసులో.. కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష విధించింది.
ఆ వివరాలు.. పానిపట్‌లోని మట్లాడా ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక తన మేనమామ ఇంట్లో ఉంటూ స్టాహానికంగా చదువుకుంటోంది. అయితే 2018 జనవరి 13న చెత్త వేయడానికి ఇంటి నుంచి బయటకెళ్లిన బాలిక.. మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఊరంతా గాలించారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసుపెట్టారు. రెండు రోజుల తర్వాత పాప మృతదేహం ఓ మురికి కాల్వలో దొరికింది. నగ్నంగా పడి ఉన్న బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదిక వచ్చింది.
ఇది కూడా చదవండి : రోజు ఆ పని చేస్తున్నాడని ఓ భార్య దారుణం!
బాలిక చెత్త వేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లడం గమనించిన ఇద్దరు వ్యక్తులు సాగర్, ప్రదీప్ బాలికను వెంబడించారు. అనంతరం బాలికను కిడ్నాప్ చేసి.. ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో.. ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేయడంతో కొద్దిసేపటికే బాలిక మృతి చెందింది. చనిపోయిన తర్వాత శవాన్ని కూడా వదిలిపెట్టలేదు. బాలిక మృతదేహంపై కూడా వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు పట్టుబడతామన్న భయంతో ఆమె దుస్తులకు నిప్పు పెట్టారు. అనంతరం రాత్రి ఎవరూ లేకపోవడంతో బాలిక మృతదేహాన్ని వాల్మీకి చౌపాల్ సమీపంలోని మురికి కాల్వలో పడేశారు. అనంతరం ఇద్దరు నిందితులు పరారయ్యారు.
ఇది కూడా చదవండి : అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఈ అమ్మాయి చేసిన పనికి..!
పోలీసులు వారి కుటుంబ సభ్యులను విచారించి.. అనుమానితుల వివరాలు సేకరించారు. చివరకు పాప ఇంటి ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడినట్లు సమాచారం రావడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం సాగర్, ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో వీరు నేరం అంగీకరించారు. వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి బలమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత.. శుక్రవారం ఈకేసులో కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులిద్దరి ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలిక కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.