కుమారుడి మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి కోడుకుని ఖననం చేసిన చోటే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీటి సంద్రంలోకి నెట్టేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సత్తుపల్లిలోని రాంబాబు అనే వ్యక్తి కుటుంబికులతో నివాసం ఉంటున్నారు. ఇతనికి సాయి అనే కుమారుడు స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
అయితే ఈ నెల 14న సాయి స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు సాయిని మందలించారు. దీంతో సాయి తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 15న పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ ఈ నెల16 మరణించాడు. కోడుకు మరణంతో తండ్రి రాంబాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే కొడుకు అంత్యక్రియల అనంతరం నుంచి తండ్రి రాంబాబు కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీంతో ఆదివారం సాయంత్రం కొడుకుని ఖననం చేసిన చోటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని రాంబాబు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మరోసారి కన్నీటి సంద్రంలోకి మునిగిపోయారు. రాంబాబు మరణంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల్లోనే తండ్రి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి రాంబాబు సూసైడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.