సాధారణంగా అత్తింటి వేధింపులు అంటే ఒక్క ఆడపిల్లకే ఉంటాయని అందరూ భావిస్తుంటారు. అదనపు కట్నమో, వెట్టి చాకిరీనో, దెప్పి పొడుపు మాటల వల్లనో, కుటుంబంలో సరైన విలువ ఇవ్వడంలేదనో ఆత్మహత్యలు చేసుకున్న కోడళ్లను చూసుంటారు. ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా కూడా ఏదొక మూలన ఇలాంటి దాష్టీకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కథ అలాంటి ఘటనలకు భిన్నమైనది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ అభాగ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏ పని చేసినా ఎత్తి చూపడం, అదిలా.. ఇదిలా అంటూ దెప్పిపొడవడం. అల్లుడు అనే అభిమానం, మర్యాద చూపకపోవడం.. కారణం ఏదైనా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రం హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం మహమ్మద్ రఫిక్ నదాఫ్ అనే వ్యక్తికి వివాహం జరిగింది. అయిన వాళ్లు కళ్లెదుట ఉంటే చేదోడు వాదోడుగా ఉంటారనో.. యోగక్షేమాలు మాట్లాడుకోవడానికి తనకంటూ ఒకరు ఉంటారని భావించాడో ఏమో.. భార్యతో కలిసి గ్రామంలోనే అత్త సాహెబీ ఇంటి ఎదురుగా కాపురం పెట్టాడు. అంతా బాగానే ఉంది. కొన్నాళ్లు అల్లుడన్న మర్యాద, అభిమానం బాగానే పొందాడు. కొన్నాళ్లకు సీన్ రివర్స్ అయ్యింది. మర్యాద, అభిమానం సంగతి పక్కన పెడితే అసలు మనిషిగా కూడా చూడటం లేదు.
ఏది చేసినా ఎత్తి చూపడం, ప్రతి విషయంలో కలగజేసుకోవడం, చేసిందల్లా తప్పంటూ జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఒక్క అత్తే కాదు.. పొరుగింట్లో ఉండే మదుకప్ప, మాంత్యలు అనే వాళ్లు కూడా అలాగే చేయసాగారు. కొన్నాళ్లకు తనపై తనకే అసహ్యం కలిగేలా వారి ప్రవర్తన సాగింది. భార్యవైపు నుంచి అయినా సరైన సహకారం అందలేదేమో? ఆ ఆత్మన్యూనత, మనోవేదనతో రఫీక్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: తల్లిని పెళ్లాడి.. కుమార్తెతో రొమాన్స్
అత్తింటి వేధింపులు అనేవి ఎవరికీ ఉండకూడదు. అది ఆడ పిల్లకైనా- మగాడికైనా. వేధింపులు ఎవరికైనా.. రిజల్ట్ మాత్రం ఏదొక అఘాయిత్యంతోనే ముగుస్తుందనే భావనకు వచ్చేలా చేస్తోంది ఈ ఘటన. ఒక ఆడపిల్ల అత్తింట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆమెను కోడలిగా కాదు.. కూతురిలా చూసుకోవాలని చెప్తుంటారు. అదే మాదిరిగా అల్లుడికి కూడా అంతే ప్రేమానురాగాలను పంచాలని మాత్రం చాలా తక్కువ మంది చెప్తారు, ఆచరిస్తుంటారు. అత్త వేధించడమే కాకుండా.. తోటివారితోనూ మాటలు అనిపించడం ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. కనీసం భార్య అయినా సహాయంగా నిలిస్తే ఇలా చేసుకునే వాడు కాదేమో? అల్లుడు ఆత్మహత్య చేసుకోవడంతో తన కుమార్తెనే విధవరాలు అయ్యింది. మరి, ఇప్పుడు ఆమెకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు? ఈ ఘటనలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.