భార్యభర్తల బంధం గురించి మన వేదాల్లోనే ఎంతో గొప్పగా చెప్పారు. మాంగళ్య బంధానికి ఉన్న శక్తి అలాంటిది. అయితే.. ఈరోజుల్లో కొంత మంది మాత్రం మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వకుండా, శారీరిక సుఖానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో మహిళలు కూడా ఎక్కువగా తప్పు దారి పడుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి:
ఇన్‌స్టాగ్రామ్ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి
నేత కార్మికుడు రాఘవేంద్రది ఓ అందమైన కుటుంబం. భార్య శైలజ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనులకు పోతుండేది. ఇద్దరూ కష్టపడి తమ కొడుకుని చదివించుకుంటూ వచ్చారు. కానీ.., ఇంతలో శైలజ బుద్ధి గతి తప్పింది. ఆ గార్మెంట్స్ లో పని చేసే హనుమంతు అనే కూలీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూతురి పాడు పనికి శైలజ తల్లి కూడా సహకరిస్తూ వచ్చింది. ఈ విషయం హనుమంతు భార్యకి, శైలజ భర్తకి తెలియడంతో పెద్దల ముందు పంచాయతి కూడా పెట్టారు. అప్పుడు తప్పు ఒప్పుకున్న హనుమంతు, శైలజ ఇక తాము ఇద్దరం కలవమని, బుద్దిగా ఎవరి సంసారం వాళ్ళం చేసుకుంటామని ఊరి పెద్దలందరికి మాట ఇచ్చారు. కానీ.., శైలజ మాత్రం ప్రియుడు హనుమంతుని వదిలి ఉండలేకపోయింది. తన భర్త అడ్డు వదిలించుకుంటే.. ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చని ఆలోచన చేసింది. అనుకున్నదే తడువుగా.. శైలజ, ఆమె తల్లి, ప్రియుడు హన్మంతు కలసి భర్త రాఘవేంద్రని ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపారు.
తన భర్త మూర్ఛతో మృతిచెందాడని శైలజ అందరిని నమ్మించింది. పెద్ద కర్మ వరకు కామ్ గా ఉండి మళ్ళీ హన్మంతుతో రాసక్రీడల్లో మునిగిపోయింది శైలజ. ఇదంతా గమనిస్తూ వచ్చిన రాఘవేంద్ర కొడుకు ఓ రోజు బంధువుల వద్దకి వెళ్లి సంచలన నిజాన్ని బయటపెట్టాడు. “నాన్న మూర్ఛతో చనిపోలేదు. అమ్మ, అమ్మమ్మ, హన్మంతు ముగ్గురు కలసి నాన్నని చంపేశారు. వారు నాన్నని చంపడం నేను స్వయంగా చూశాను. అమ్మకి భయపడి ఇన్ని రోజులు కామ్ గా ఉండిపోయానని 7 ఏళ్ళ పిల్లాడు అసలు నిజం బయటపెట్టడంతో అంతా షాక్ కి గురయ్యారు. ఇలా కొడుకు సాక్ష్యంతో శైలజ భాగోతం బయట పడటంతో దొడ్డ గ్రామీణ పోలీసులు శైలజ, హనుమంతు, లక్ష్మిదేవిలను అరెస్టు చేశారు. మరి.. శారీరిక సుఖం కోసం సొంత భర్తని చంపుకుని, కడుపున పుట్టిన బిడ్డకి దూరమై, జైల్లో ఊసలు లెక్క పెడుతున్న శైలజ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.