ఇన్‌స్టాగ్రామ్‌ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి

ప్రస్తుతం యువత అంతా సోషల్ మీడియా వైపే పరుగులు. తమకున్న టాలెంట్ తో అదరగొడుతూ లక్షల కొద్దీ పాలోవర్లను పెంచుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన అఫ్రీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో మిలియన్‌ పాలోవర్లను సంపాదించింది .ఈ ఫీట్ మాములేగా అని మనకు అనిపించొచ్చు. సెలెబ్రెటీలో, వ్యాపారవేత్తలో అయితే ఈ ఫీట్ సర్వ సాధారణం.. కానీ తను సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో కాదు, సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో!.

 

View this post on Instagram

 

A post shared by Afrinvaj (@afrinvaj75)

అఫ్రీన్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ప్రాణం.డాన్స్ చేస్తూ సరదాగా వీడియోలు తీసుకునేది. అప్పట్లో టిక్ టాక్ వేదికగా వీడియోలు పోస్ట్ చేసేది. కానీ ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించడంతో ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. డ్యాన్స్‌, ఫ్యాషన్‌ వీడియోలు కాకుండా, కొవిడ్‌ జాగ్రత్తలు వంటి సామాజిక అంశాలపైనా వీడియోలు చేస్తూ ఉంటుంది. క్రమంగా పాలోవర్లు పెరుగుతూ, ఇటీవలే ఆ సంఖ్య 10 లక్షలు దాటింది.

gire min

ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనే కాదు చదువులోనూ రాణిస్తోంది. ప్రస్తుతం అఫ్రిన్‌ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. రోజూ కళాశాలకు వెళ్లడం, సాయంత్రం పాఠాలు చదువుకోవడం తప్పనిసరి. తాజాగా డిగ్రీ మూడో సెమిస్టర్‌ ఫలితాల్లో 91.7 శాతం సాధించింది. మరి ఇవన్నీ ఎలా సాధ్యం అంటే… ఖాళీ సమయంలోనే!.

 

View this post on Instagram

 

A post shared by Afrinvaj (@afrinvaj75)

అఫ్రిన్‌ ఇప్పటి వరకూ 975 వీడియోలు చేసింది. తనకు తమిళనాడు, బెంగుళూరు, కేరళల్లోనూ అభిమానులు ఉన్నారంటోంది. వారి కోసం ఆయా భాషల్లో వీడియోలు చేస్తోంది. నిండా 20 ఏళ్లు కూడా లేని అమ్మాయి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధించగలం అంటూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Afrinvaj (@afrinvaj75)

తాజాగా వైస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్, అఫ్రీన్‌ని సన్మానించారు. యువత అందరూ అఫ్రీన్‌ని ఆదర్శంగా తీసుకొని తమకున్న టాలెంట్ తో తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని అందులో రాణించాలని కోరారు.

 

View this post on Instagram

 

A post shared by Afrinvaj (@afrinvaj75)