ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
ఈ మద్య ప్రతి చిన్న విషయానికి చాలా మంది మనస్థాపానికి గురి కావడం.. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. వివాహేతర సంబంధాల వల్ల ఇటీవల కాలంలో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఓ పంట కాలువ వద్ద మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
వనచర్ల వారి వీధికి చెందిన గాది నాగబాబు, మల్లేశ్వరి గత మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. గతంలోనే వీరిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మల్లేశ్వరి తన భర్తను వదిలివేయగా.. నాగబాబు తన భార్యను వదిలివేశాడు. ఈ క్రమంలోనే మూడేళ్లుగా వనచర్లవీధిలోనే ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ మద్య మల్లేశ్వరి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5 న డ్వాక్రా డబ్బులు తీసుకునేందుకు హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చింది. 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి శ్రీపతి రాంబాబు, బంధువులు మల్లేశ్వరి కోసం గాలించడం మొదలు పెట్టారు.
నాగాబాబు తన రెండేళ్ల కూతురుని బంధువుల ఇంట్లో ఉంచాడు. అతను కూడా రెండు రోజుల నుంచి కనిపించకుండాపోవడంతో నాగబాబుపై అనుమానం వచ్చిన మల్లేశ్వరి కుటుంబీకులు శనివారం రాత్రి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం అమలాపురం కంపోస్టుయార్డు సమీపంలో మల్లేశ్వరి పంట కాలువలో శవమై కనిపించింది. అప్పటికే మృతదేహం కుళ్లిపోయింది. సంఘటనా స్థలంలోనే శవ పంచనామా చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వా ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే విషయం వెలుగులోకి వస్తాయని డీఎస్సీ తెలిపారు. మహిళ అదృశ్యం కేసును అనుమానాస్పద మృతిగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.