జీవితంలో మనిషికి ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు వాటిని భరించలేని పరిస్థితి కూడా వస్తుంది. కొందరు ఎదిరించి నిలుస్తారు.. ఇంకొందరు ఓటమి భారంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఓ వ్యక్తి అరగుంట భూమికోసం పోరాటం చేశాడు. ఎంత ప్రయత్నించినా తన భూమిని దక్కించుకోలేక పోయాననే బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చదివిన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో కమ్మం వినయ్ కుమార్(34) నివాసముండేవాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎంబీఏ పూర్తి చేసిన వినయ్ ఆ తర్వాత ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో ఆరేళ్లు పని చేశాడు. అతని తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వారు ఇటీవల ఆస్తి పంపకాలు చేసుకున్నారు. వినయ్ పెద్దనాన్నకు 20 గుటల స్థలం ఇచ్చారు. 2 గుంటల ఇళ్ల స్థలాన్ని మేనత్తకు ఇచ్చారు. ఆ భూమిని ఆమె తన తమ్ముడికి అమ్ముకుంది. ఆ తర్వాత అతను దాన్ని మరో వ్యక్తికి విక్రయించాడు.
ఆ భూమిలో తమకు అర గుంట రావాలంటూ వినయ్ చాలా రోజుల నుంచి కోరుతున్నాడు. మేనత్త- చిన్నాన్నపై న్యాయపరంగానూ పోరాడుతున్నాడు. అంతేకాకుండా వినయ్ కు మరో సమస్య వచ్చింది. ఆరేళ్లుగా తాను పనిచేసిన ఫెర్టిలైజర్ దుకాణం యజమాని వినయ్ పై దొంగతనం మోపాడు. మోసగాడంటూ ప్రచారం చేశాడు. ఆ రెండు విషయాల్లో వినయ్ మనస్తాపానికి గురయ్యాడు. ఓ సూసైడ్ నోట్ రాసి.. వినయ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ నోట్ లో తన చావుకు వీళ్ల కారణం అంటూ రాసుకొచ్చాడు.
ఇదీ చదవండి: ఆశ్రయం కోసం వచ్చిన బాలికను తల్లిని చేసిన దుర్మార్గుడు!
‘వేణు అంకుల్ నా గోస తగిలి మీరు, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. నా చావుకు బూర్ల భాస్కర్, కమ్మం సమ్మయ్య, కమల, వినీత్, వివేక్, విశాల్, దొడ్డి సురేష్, గట్టయ్య, చంద్రయ్య, మహేంద్ర, ఉదయ్, కావ్య, గంజి అలేఖ్యలు కారణం. వీళ్లు నా భూములు ఆక్రమించుకున్నారు. ప్రిన్స్ సారీ రా నన్ను క్షమించు’ అంటూ వినయ్ కుమార్ రాసిన సూసైడ్ నోట్ స్థానికులను సైతం కలచి వేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.