భార్యాభర్తల అన్యోన్య జీవితంలో కొందరు భార్యాభర్తలు పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. పరాయి వాడి మోజులో పడి భర్తను కాదని పడక సుఖానికి అలవాటు పడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. దీనికి అడ్డొచ్చిన భర్తలను, పిల్లలను కూడా కాదనుకుంటూ చివరికి భర్తల చేతిలో ప్రాణాలు తీసుకుంటు లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కోరటగెరె తాలుకాలోని గిరిచిక్కనహళ్లి ప్రాంతం. ఈ గ్రామంలోని ఓ వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వస్తుంది. ఇక కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే భర్తకు భారీగా వ్యవసాయ భూములు ఉండడంతో పనుల నిమిత్తం సొంతంగా ఓ ట్రాక్టర్ ను కొన్నారు. ఆ తర్వాత భర్త ఒక్కడే పనులో చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో గత కొన్ని రోజుల క్రితం ఓ డ్రైవర్ ను పెట్టుకున్నారు. అలా వారి పనులు చక చక జరిపోతున్నాయి. దీంతో భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉన్నారు.
కానీ ఇంతలోనే ఆ భూస్వామి భార్య ట్రాక్టర్ డ్రైవర్ తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక రోజులు గడిచే కొద్ది అతని భార్య డ్రైవర్ లో మోజులో పడి పడక సుఖానికి అలవాటు పడింది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి వివాహేతర సంబంధం ఊరంతా పాకింది. చివరికి భర్తకు కూడా తెలిసిపోయింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త భార్యను చితకబాది నా పరువు తీస్తున్నావంటూ కోపంతో రగిలిపోయాడు.
భర్త ముందే నా పరువు పోయిందని అతని భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ భయంతో అతను కూడా సూసైడ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక వీరిద్దరి సాగించిన ఈ ఘనకార్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.