చికెన్ కబాబ్ కదా అని ఇష్టంగా తిన్న విద్యార్థినులకు అది తీవ్ర విషాదాన్ని నింపింది. వాంతులు, విరేచనాలతో వందకుపైగా విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని, మంగళూరు పరిధిలో ఉన్న సిటీ నర్సింగ్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థినులందరికీ ఘీ రైస్, చికెన్ కబాబ్ వడ్డించారు. హాస్టల్‌లో 400కు పైగా విద్యార్థినులు ఉండగా, నాన్- వెజ్ తినని వారు మినహా మిగిలిన అందరూ చికెన్ కబాబ్ తిన్నారు.
తిన్న కాసేపటికే ఒక విద్యార్థినికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తనకు ఆరోగ్యం బాగోలేక అలా అయిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, సోమవారం తెల్లవారుజామున మరికొంతమంది విద్యార్థినిలకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తాయి. రెండు రోజుల్లోనే ఆ సంఖ్య వంద దాటింది. దీంతో వారందరినీ మంగళూరులోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్లు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#BREAKING More than 100 students of city nursing college admitted to hospital allegedly due to food poisoning in #Mangalore. Students admitted to various hospitals in the city. Cops are investigating the matter. #Karnataka pic.twitter.com/JQWpOLlAvI
— Imran Khan (@KeypadGuerilla) February 6, 2023
ఈ విషాద ఘటన నేపథ్యంలో అధికారులు హాస్టల్‌లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థినులు తిన్న ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపారు. శుభ్రత పాటించకపోవడం, కలుషిత నీరు వల్లనే ఫుడ్‌పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న విద్యార్ధినుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసుపత్రిలకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Karnataka | Around 137 students of a private nursing and paramedical college in Shakthinagar area of Mangaluru were admitted to different hospitals in the city yesterday, after they complained of food poisoning, allegedly after having food at their hostel mess | reported by ANI pic.twitter.com/ien5BkNMh3
— NDTV (@ndtv) February 7, 2023