మే 10న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. వ్యూహా, ప్రతి వ్యూహాలతో పార్టీలు దూసుకు వెళుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారం దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు బీజెపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) యోచిస్తున్నాయి. అయితే ఈ సమయంలో జెడీఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మే 10న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. వ్యూహా, ప్రతి వ్యూహాలతో పార్టీలు దూసుకు వెళుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారం దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు బీజెపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) యోచిస్తున్నాయి. కాగా, ఇందులో పోటీ మొత్తం బీజెపీ, కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుండగా.. ఈ ఫలితాల్లో జేడీఎస్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో జెడీఎస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుతో పాటు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రచారాలను ఉథృతంగా చేపడుతున్న జెడీఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఈ కీలక సమయంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఎన్నికల సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌డీ కుమారస్వామి విస్తృత పర్యటనలు చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోకుండా పర్యటిస్తుండటంతో ఆయన అనారోగ్యం బారిన పడినట్టు జేడీఎస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం చేపట్టిన కార్యకలాపాలను వాయిదా వేసుకున్నారు. అలాగే ఆరోగ్యం విషయంలో కలత చెందరాదని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. వైద్యులు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు వివరించారు. వైద్యులు సూచించడంతో తాను హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్టు తెలిపారు.